PPM: పాలకొండ పంచాయతీ ప్రత్యేకాధికారి టి.వైకుంఠరావు శనివారం పట్టణంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ మేరకు సీతంపేట రోడ్డుపైకి ఇరిగేషన్ కెనాల్ నీరు రావడంతో అక్కడికక్కడే JCBతో కాలువ తీయించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏ రోజు చెత్త ఆ రోజే డంప్ చేయాలని ఆదేశించారు.