WGL: పట్టణ కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్టోబర్ 1న ఆసుపత్రి సమీపంలోని గుడి వద్ద కదలకుండా ఉన్న ఆయనను వైద్య సిబ్బంది ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన నేడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన వివరాలు తెలిసిన వారు 7812685005 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు కోరారు.