MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని నిర్మల ఆసుపత్రిపై యువకులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. మండలంలోని వెంకటాపురం గ్రామానికి నలమాస ప్రశాంత్, అతనితో వచ్చిన కొంతమంది యువకులు సాయంత్రం 6 గంటల సమయంలో చికిత్స కోసం అస్పత్రికి వచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించి వారిపై దాడికి పాల్పడ్డారు.