TG: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. శ్రీరామ్‌సాగర్, నదీపరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు తెరిచి 3,43,409 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. ఈ నేపథ్యంలో గోదావరి నదీపరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.