SS: మడకశిర మండలం వై.బి హళ్లి, పత్తికుంట గ్రామాలకు చెందిన శ్రీధర్, చక్రంరాజు, హనుమంతగౌడ్, రంగరాజు, నరసే గౌడ్, లక్ష్మప్పతోపాటు 50 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పాల్గొన్నారు.