అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. అయితే, 448/5 ఓవర్ నైట్ స్కోర్ వద్ద టీమిండియా తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రస్తుతం భారత్ 268 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా (104*), వాషింగ్టన్ సుందర్ (9*) నాటౌట్‌గా నిలిచారు.