ADB: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. బేల మండలం శంకర్ గూడ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో రూ. 57,800 నగదు లభించడంతో పోలీసులు దానిని సీజ్ చేశారు. ముక్తార్ సర్వర్ షేక్‌పై కేసు నమోదు చేసినట్లు బేల డిప్యూటీ తహశీల్దార్ వామన్ తెలిపారు. సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేశారు.