ప్రకాశం: ఒంగోలులోని రైల్వే స్టేషన్ను డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్లో ప్రతి అణువణువును పోలీస్ డాగ్స్ సహాయంతో తనిఖీ చేసి, అనుమానిత వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.