ELR: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించే ‘ఆటో డ్రైవర్ సేవ’ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి కనీసం 500 మంది లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో హాజరయ్యేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.