ADB: ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్డు సమీపంలో ఎస్సై ప్రవీణ్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. అంతేగాక వాహనదారులు బండి పత్రాలను తమ వెంట ఉంచుకోవాలన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. అలాగే తాగి బండి నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు.