SKLM: ఆమదాలవలస మండలం తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా ఏడాదికి అతిధి అధ్యాపకుల నియామకం కోసం బోటనీ, పొలిటికల్ సైన్స్ విభాగాలలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం. సత్య నారాయణరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీజీతో పాటు పీహెచ్డీ, నెట్/ఏపీ సెట్ అర్హత గల అభ్యర్థులు ఈ నెల 9 తేదీ లోగా కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.