GDWL: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ప్రాజెక్టుకు 2,87,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోందని ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపారు. జలాశయంలో ప్రస్తుతం 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 2,77,176 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉండటం వలన, దిగువకు విడుదల చేసేందుకు 15 గేట్లు ఎత్తివేసినట్లు నేర్కొన్నారు.