NTR: సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలు ఎల్లప్పుడూ అవగాహన కలిగి ఉండాలని పటమట ఎస్సై హరికృష్ణ అన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ప్రజల్లో సైబర్ నేరాలుపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు సిబ్బందితో రిటైడ్ ఎంప్లాయ్లతో కూడా ఈ సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన తీసుకువస్తున్నామన్నారు.