KRNL: హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవం మళ్లీ విషాదాన్ని మిగిల్చింది. సంప్రదాయంగా జరిగిన ఈ ఉత్సవంలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, వందల మందికి గాయాలయ్యాయి. అవగాహన కార్యక్రమాలు, భద్రతా చర్యలు విఫలమయ్యాయి. ఈ ఘటనపై ఎంపీ బస్తీపాటి నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, రక్తపాతం ఆపడంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.