ADB: జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గురువారం ‘వేస్ట్ టు వండర్’ పార్కును జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ట్రైనీ కలెక్టర్ సలోని, మున్సిపల్ కమిషనర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినియోగంలో లేని వస్తువులతో ఆకర్షణీయమైన ఉపకరణాలు తయారు చేయడం అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు.