TPT: పెరుమాళ్ళపల్లిలో వెలసిన శ్రీ ఏకాంబరేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తుడా ఛైర్మన్, TTD బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి అమ్మవారి మూలముర్తిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.