KMR: మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బాస బాల్ కిషన్ దసరా పండుగ సందర్భంగా శ్రీ రాముడు రావణాసురుడిని వధిస్తున్న చిత్రాన్ని రావి ఆకుపై రూపొందించాడు. చెడుపై మంచికి విజయంగా దసరా పండుగ స్ఫూర్తినిస్తుందని సందేశం ఇచ్చారు. ఈ చిత్రాన్ని చూసి ప్రజలు బాస బాల్ కిషన్‌ను అభినందించారు.