VZM: శృంగవరపుకోట పోలీసు స్టేషన్ పరిధి గౌరి శంకర్ కాలనీ శివారులో కోడిపందేలు ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని సీఐ వి.నారాయణమూర్తి గురువారం తెలిపారు. వారి నుంచి ఐదు కోడిపుంజులు, రూ.500 నగదును స్వాధీనం చేసుకొని సెక్షన్ (9) 2 ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పట్టణ పరిధిలో ఆ సాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.