కోనసీమ: కొత్తపేట MLA ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలను కార్యాలయ సిబ్బంది గురువారం వెల్లడించారు. ఉదయం 10:00 గంటలకు రావులపాలెం – వెదిరేశ్వరం రోడ్డులో ఉన్న రిలయన్స్ స్మార్ట్ పాయింట్ నందు జీఎస్టి 2.0 గురించి వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం 11:00 గంటలకు రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తారు.