JN: గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2 క్వింటాల పత్తిని అపహరించిన ఘటన పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత రైతు దామెర సోమయ్య వివరాల ప్రకారం.. ఏరిన పత్తిని బావి దగ్గర కుప్ప పెట్టగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు. సుమారు రూ. 20 వేల నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశాడు.