కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయంలో గురువారం విజయ దశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శమీ వృక్ష పూజలు, ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం ఆలయ అర్చకులు స్వామీ వారిని అశ్వవాహనంపై ఆలయ పుర వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సుధాకర్ ఛైర్మన్ రామారావు భక్తులు పాల్గొన్నారు.