KMNR: హుజురాబాద్ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో గురువారం రోజున మాజీ దేశ రెండో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.