CTR: నగరంలోని తేనెబండ శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గురువారం శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం ప్రాంగణంలో పాలకమండలి అధ్యక్షులుగా వై.యుగంధర్ బాబు, మరో 8 మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వారు సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు