KRNL: హింసతో సాధించే గెలుపు కన్నా, అహింసతో సాధించిన విజయం ఎంతో గొప్పదని చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ చెప్పారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా నగరపాలక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింసలను తన అస్త్రాలుగా మార్చుకుని దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టారని కొనియాడారు.