సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో కదిరి పరిసర ప్రాంతాలలో గురువారం డ్రోన్ సహాయంతో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ శివ నారాయణస్వామి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.