E.G: గోకవరం మండలం వీరలంక పల్లి గ్రామ దేవత ఒనువులమ్మ తల్లి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు గురువారం పాల్గొన్నారు. తొలిత ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కంబాల శ్రీనివాసరావుకి ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి, శాలువతో సత్కరించారు. అనంతరం అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.