VZM: దసరా పండగ సందర్భంగా కొత్తవలస పాత రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీసత్య సాయి మందిరంలో గురువారం ప్రత్యేక భజనలు నిర్వహించారు. భజనలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, సాయి కీర్తనలు ఆలపించారు. హారతి ఆనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పి.రవికుమార్ పాల్గొన్నారు.