హైదరాబాద్ బేగంబజార్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూసి ఉన్న కనిష్క ఫ్యాషన్ జువెల్లరీ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంలో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు, జరిగిన నష్టం విలువ తెలియాల్సి ఉంది.