AP: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద ముప్పుపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు.