HYD నగర వ్యాప్తంగా ఇవాళ రాత్రి చిరుజల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా TGDPS అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా మేడ్చల్, కీసర, మౌలాలి, శేర్లింగంపల్లి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లుగా వివరించింది. వర్ష భావంతో అంతగా ఇబ్బంది ఉండదని, ఏదేమైనప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.