RR: షాద్ నగర్ పట్టణంలోని భవాని నగర్ కాలనీలో గల భవాని మాత ఆలయంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి విజయాలు వరించాలని ఆకాంక్షించారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఆరాధిస్తే జ్ఞాన ప్రాప్తి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్, నాయకులు పాల్గొన్నారు.