NTR: గత కొన్నేళ్లుగా నిరాదరణకు గురైన విజయవాడ గాంధీ హిల్ పునఃప్రారంభం కావడం సంతోషంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గురువారం గాంధీ హిల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్ముడి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కలెక్టర్ లక్ష్మీశా తదితరులు పాల్గొన్నారు.