కోనసీమ: భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ శ్రేణులు చేపట్టిన సేవా పక్షోత్సవాలు ఆత్రేయపురంలో ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా హెల్త్, అంగన్వాడీ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోడీ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రకటించి దేశానికి సేవ చేస్తున్నారన్నారు.