NZB: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం మతిస్థిమితం కోల్పోయిన ఓ ప్రయాణికుడు అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్‌కి చెందిన నర్సయ్య ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి, అనారోగ్యంతో స్వదేశానికి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో నర్సయ్యను గుర్తించి గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.