ప్రకాశం: గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ ఆయన చిత్రపటానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.