KNR: గంగాధర మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ.. గాంధీ చెప్పిన సిద్ధాంతం సత్యం, అహింస ద్వారా మన హక్కులను సాధించుకోవాలని, ఆయన చూపిన బాటలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిర్ధవార్లు రజనీకాంత్ రెడ్డి, సంతోష్ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.