ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ మధ్య ట్రోఫీ వివాదం నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ మాదిరిగానే మహిళల వన్డే వరల్డ్ కప్లో ఈనెల 5న భారత్-పాక్ మ్యాచ్లోనూ షేక్ హ్యాండ్ ఉండదని సంకేతాలు ఇచ్చాడు. పాక్తో సంబంధాల విషయంలో వారం వ్యవధిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు.