కృష్ణా: గుడివాడ పట్టణంలో తొలి ఐటి కంపెనీ దసరా పర్వదినాన ప్రారంభమయ్యింది.100 సిట్టింగ్ కెపాసిటీతో ప్రిన్స్ స్టన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఆపరేషన్స్ గుడివాడలో ప్రారంభం అయ్యాయి. దీనికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పూజా కార్యక్రమాలు నిర్వహించి, ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నేడు ప్రారంభమైన ఐటీ కంపెనీ విజయవంతంపై..గుడివాడ సక్సెస్ ఆధారపడి ఉందని ఆయన తెలిపారు.