NGKL: తాడూరు మండలం ఏటీదర్పల్లి గ్రామంలో కౌకుంట్ల రమేష్ గౌడ్ తన సొంత ఖర్చుతో గ్రామానికి నూతన బస్టాండ్ నిర్మించారు. గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఈ బస్టాండ్ పనులు పూర్తయ్యాయి. గ్రామ ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ బస్టాండ్ ఏర్పాటు చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, గ్రామ అభివృద్ధి పట్ల ఆయన చేసిన కృషి ప్రశంసనీయం అని గ్రామస్థులు పేర్కొన్నారు.