MDK: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మెదక్ గాంధీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు పట్టిక, మందుల స్టాక్ రిజిస్టర్, ఓపి రిజిస్టర్ పరిశీలించారు.