SRD: అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో గురువారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద బ్రాహ్మణుడు వేద మంత్రోచ్ఛారణాల మధ్య ఆచార సాంప్రదాయ పద్ధతిన దుర్గా భవాని మాతకు అభిషేకం, పూజలు మంగళ హారతి చేశారు. విజయదశమి పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.