KRNL: మహాత్మా గాంధీ మార్గం అనుసరణీయమని UTF జిల్లా గౌరవాధ్యక్షులు దావీదు, జిల్లా కార్యదర్శులు బాబు, కౌలన్న తెలిపారు. నేడు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. శాంతి, అహింస అనే ఆయుధాలతో గాంధీ స్వాతంత్ర పోరాటం కొనసాగించారని తెలిపారు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి పోరాటాలను విజయవంతం చేశారన్నారు.