KDP: సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామయ్య మాట్లాడుతూ.. మహాత్ముడి స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు నడవాలన్నారు. అనంతరం శాంతియుత మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చు అన్నారు.