మేడ్చల్: హక్కుల సాధనకై శాంతియుత పోరాటాన్ని బోధించి, ఆచరణలో చూపిన మహాత్మా గాంధీ చిరస్మరణీయులని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సత్యాగ్రహ సిద్ధాంతాలను ప్రపంచానికి అందించిన గాంధీ మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమన్నారు.