MNCL: దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీజీ అందరికీ స్ఫూర్తినిచ్చే వ్యక్తని లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ అహింసా పద్ధతిలో స్వాతంత్య్రం తీసుకు వచ్చారన్నారు.