ప్రకాశం: ఒంగోలులోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ బయట, ప్రహరీ గోడ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవని, అయితే స్థానికంగా యాచకుడు అన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.