GNTR: ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి ముస్లిం కళాశాల వద్ద నిర్మానుష ప్రదేశంలో గంజాయి, మత్తు బిళ్లలను కరిగించి ఇంజక్షన్ ద్వారా సేవిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో గోవా నుంచి రైలులో ప్రయాణిస్తూ గంజాయి, మత్తు బిళ్లలను తెచ్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.