KNR: మానకొండూరు మండలానికి చెందిన మోదుంపల్లి మహేశ్వరి, తన కుటుంబం ఎదుర్కొన్న పేదరికం, ఆర్థిక ఇబ్బందులను దాటుకుని పట్టుదలతో చదివి గ్రూప్-1లో 474వ ర్యాంక్ సాధించడంతో డీఎస్పీ ఉద్యోగాన్ని దక్కించుకుంది. ఆమె సాధన, కష్టపడి అర్హత సాధించడంపై కరీంనగర్ సీపీ గౌస్ అలాం ప్రత్యేక అభినందనలు తెలిపారు.