ప్రస్తుతం స్టార్ బ్యూటీ సమంత మయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పుడు ఆనందంతో గాల్లో తేలుతున్నానని చెబుతోంది. సమంత నటించిన లేటెస్ట్ ఫిల్మ్ యశోద.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా నవంబర్ 11న థియేటర్లలోకి వచ్చింది.
హరి, హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ తర్వాత వసూళ్ల జోరు కాస్త తగ్గినా.. త్వరలోనే యశోద బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ నేపథ్యంలో సమంత ఆడియెన్స్‌కు ఎమోషనల్ లెటర్ రాసింది సమంత. ‘ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో ఎంతో ఆనందంగా ఉందని..
మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, ప్రశంసలు, మద్దతు చూస్తున్నాను.. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి’ అంటూ థాంక్స్ చెప్పింది. అలాగే ‘యశోద’ థియేటర్లలో మీ సంబరాలు చూసి.. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉందని.. ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికి థాంక్స్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ ఎమోషనల్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. యశోదకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ చెబుతున్నారు.
‘యశోద’ సక్సెస్ మీట్లో సీక్వెల్ ఐడియా రెడీగా ఉన్నట్లు దర్శకులు హరి, హరీష్ వెల్లడించారు. అంతేకాదు థర్డ్ పార్ట్‌కు కూడా లీడ్ రెడీగా ఉందన్నారు. సమంత కోలుకున్న తర్వాత సీక్వెల్ చర్చ స్టార్ట్ అవనుందని చెప్పారు. యశోద సీక్వెల్ ఓకే అయితే.. సమంత నుంచి వస్తున్న ఫస్ట్ సీక్వెల్ ఇదేనని చెప్పొచ్చు. మరి యశోద సీక్వెల్స్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో చూడాలి.