VSP: భీమిలో చరిత్ర కలిగిన క్లాక్ టవర్ శిథిలావస్థకు చేరుకుంది. దీనిపై పత్రికల్లో పలు కథనాలు వచ్చాయి. దీంతో మంగళవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈమేరకు క్లాక్ టవర్‌ను పరిశీలించారు. రూ.30 లక్షలతో మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్లాక్ టవర్‌కు సంబంధించి అధికారులతో ఆయన మాట్లాడారు.